మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

-

వెనకబడిన వర్గాల నాయకుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరి ఠాకూర్‌ శతజయంతి రోజునే ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో.. కర్పూరి ఠాకూర్ జన్మించారు. డిసెంబర్ 1970 నుంచి జూన్ 1971 వరకు బిహార్ ముఖ‌్యమంత్రిగా ఠాకూర్ సేవలు అందించారు.

1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు ఆయన బిహార్కు సీఎంగా మరోసారి సేవలందించారు. భారతీయ క్రాంతిదళ్, జనతా పార్టీల్లో సేవలందించారు. జననాయక్ అనే పేరుతో ఆయన ప్రసిద్ధి గాంచారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. కర్పూరీ ఠాకూర్‌ను భారత్‌ రత్నతో గౌరవించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి గుర్తుగా నిలిచే జననాయక్‌ ఠాకూర్‌కు ఆయన శతజయంతి వేళ అవార్డు ప్రకటించడంపైసంతోషం ప్రకటించారు. వెనకబడిన వర్గాల అభివృద్ధికి, సమానత్వానికి ఠాకూర్‌ చేసిన కృషికి ప్రతిష్ఠాత్మక భారతరత్న పురష్కారం గుర్తింపు అని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version