రేపటి నుంచే మార్కెట్లోకి భారత్ రైస్ రానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ భారత్ రైస్ కిలో బియ్యం కేవలం 25 రూపాయలకే..దొరుకుతాయని వెల్లడించారు. మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు విస్తరణ.. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్దికి మౌళిక వసతులు పెంచుతున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్.
పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని తెలిపారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని వివరించారు.