ఉప ప్రధానిగా నీతీశ్​ కుమార్.. బీజేబీ నేత వ్యాఖ్యలే నిజమైతే

-

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవి చేపట్టడం అంత ఈజీగా జరగలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో బిహార్ లోని జేడీయూ, ఏపీలోని టీడీపీ ప్రధాన పాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ రెండు పార్టీలు కనుక ఎప్పుడైనా మధ్యలో వెనకడుగు వేస్తే మోదీ ఇరకాటంలో పడినట్లే. అయితే ఇప్పట్లో ఆయనకు ఆ పరిస్థితి వచ్చేలా కనిపించకపోయినా.. ప్రధాని పోస్టుకు మాత్రం సబార్డినేట్ వస్తారేమో అన్న వార్తలు ఇప్పుడు బాగా చర్చనీయాంశమవుతున్నాయి.

బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఉప ప్రధాని కానున్నారా? ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్​ చౌబే చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ పీఎం​గా నీతీశ్​ ఎంపిక లాంఛనమే అనే సంకేతాలిస్తున్నాయి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఎన్​డీఏకు కూటమి బలపడడానికి నీతీశ్​ కుమార్ ఎంతో కృషి చేశారన్న అశ్వినీ కుమార్​ చౌబే .. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.  ఆయన ఉప ప్రధానమంత్రి కావాలనేది తన వ్యక్తిగత కోరిక అంటూనే.. అదే జరిగితే బాబు జగ్జీవన్​ రామ్ తర్వాత బిహార్​ గడ్డపై పుట్టిన రెండో బిడ్డ ప్రధాన మంత్రి గద్దెనెక్కినట్లు అవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news