ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అప్పుడే ఆర్థిక సమస్యలు లేకుండా జీవించగలరు. ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి. సహజంగా అందరూ ఇంటిని తరచుగా శుభ్రంగా ఉంచుతూ ఉంటారు. కానీ ఇల్లును తుడిచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. ఈ పొరపాట్లు చెయ్యడం వలన ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఎదురవుతాయి. దీని వలన ఎక్కువ కాలం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది.
ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదను పెంచుకోవాలంటే, ఇల్లును తుడిచే సమయంలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడాలి. ఇంటిని ఎప్పుడూ సూర్యాస్తమయం ముందే శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమం అయిన తర్వాత ఇల్లును తుడవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. అయితే తప్పకుండ శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటే, ఇంట్లో ఉండే చెత్తను ఒక పక్కకు పెట్టడం లేక డస్ట్ బిన్‌లో వేయడం వంటివి చెయ్యాలి. కానీ అస్సలు బయట పడేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరియు ఆర్థిక సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. ఎక్కువ చెత్త ఉండడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు. దీని వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇల్లును తుడిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ నియమాలను సరిగ్గా పాటించరో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, ఆర్థికంగా బలహీనంగా అవ్వడం, శత్రువులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎప్పుడైతే పొందుతారో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఇంటిని తప్పకుండా శుభ్రంగా ఉంచాలి.