చివరి విడత ఎన్నికలకు బీహార్ సిద్ధమైంది ఇవాళ 78 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది బరిలో ఉన్న 1204 మంది అభ్యర్థులలో బీహార్ అసెంబ్లీ స్పీకర్ తో పాటు 12 మంది మంత్రులు కూడా ఉన్నారు. బీహార్ లో 19 జిల్లాల పరిధిలోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ మూడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి.
కోసీ, సీమాన్చల్ ప్రాంతాల్లోని ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి కూడా గట్టి పట్టు ఉండడంతో ఎన్డీఏకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎంఐఎం కూడా పెద్ద ఎత్తున అభ్యర్ధులను బరిలోకి దింపడంతో అక్కడ ఎవరికి జనం పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ దశలో మొత్తం 1204 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని వినియోగించుకోబోతున్నారు. ఈ 78 స్థానాలతో పాటు వాల్మీకి నగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ నెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ఉండనుంది.