నోరు జారినందుకు ఉపవాసం.. వివాదం వేళ బీజేపీ నేత ఆసక్తికర పోస్టు

-

ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత సంబిత్‌ పాత్ర.. పూరీ జగన్నాథుడిపై చేసినచేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ అది అనుకోకుండా జరిగిందని అన్నారు. దానికి ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘నేను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రధాని మోదీ రోడ్‌షో తర్వాత పలు మీడియా ఛానెళ్లతో మాట్లాడాను. అన్నిచోట్ల మోదీ.. పూరీ జగన్నాథుడికి పరమభక్తుడు అని చెప్పాను. కానీ మరోచోట మాట్లాడుతూ అందుకు విరుద్ధంగా స్పందించాను. అది అనుకోకుండా జరిగిన తప్పు. కానీ ఇది కొందరిని బాధించి ఉంటుంది. దేవుడు కూడా అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. నోరు జారినందుకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అంటూ సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.

మరోవైపు సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘జగన్నాథుడు విశ్వానికి ప్రభువు. ఆయన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది’’ అంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news