బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు గత 40 రోజులుగా గుజరాత్ రాజ్‌కోట్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు. ఆయన కోవిడ్-19 బారినపడడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎయిర్ అంబులెన్సులో చెన్నైకి తరలించనున్నారు. ఆయన మొన్నీమధ్యనే బీజేపీ తరపున రాజ్యాసభ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.
బాల సుబ్రహ్మణ్యంకు చికిత్స అందించిన చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో భరద్వాజ్ చికిత్స పొందనున్నారు. అభయ్ భరద్వాజ్ కు చికిత్స అందించేందుకు అక్కడ డా. బాలకృష్ణన్ బృందం సిద్దంగా ఉంది. డా. కె.ఆర్. బాలకృష్ణన్ ఊపిరిపిరితిత్తులకు గాను ఇండియాలోనే పేరు మోసిన డాక్టర్. అభయ్ భరద్వాజ్ ను చార్టర్డ్ విమానంలో చెన్నైకి తరలించనున్నారు. 11 గంటలకు కుమారుడు అన్ష్, సోదరుడు నితిన్ భరద్వాజ్ కూడా వెంట వెళ్తారు. ముంబైకి చెందిన డాక్టర్ ఓజాతో సహా 3 మంది వైద్యుల బృందం కూడా ఆయనతో పాటు చెన్నై వెళ్లనున్నారు.