భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ఊహించని పరిణామం ఎదురైంది. జేపీ నడ్డా అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. కొంతమంది గుర్తు తెలియని సైబర్ కేటుగాళ్లు జేపీ నడ్డా అకౌంటు హ్యాక్ చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.
ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం విశేషాలపై ట్వీట్ చేసిన సైబర్ కేటుగాళ్లు… బిట్ కాయిన్స్ పై కూడా పలు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశ ప్రజల కోసం తాము డబ్బులు వసూలు చేస్తున్నట్లు.. ఆయన ట్విటర్ ద్వారా ట్వీట్లు పెట్టారు. అయితే విషయాన్ని భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయ సిబ్బంది వెంటనే గ్రహించారు. ఈ సంఘటనపై అలర్ట్ అయిన సిబ్బంది.. దీని పై విచారణ కు సిద్ధమయ్యారు. దీని పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
BJP national president JP Nadda's Twitter account hacked. pic.twitter.com/AdZ3fh7pd3
— ANI (@ANI) February 27, 2022