JP Nadda: జేపీ నడ్డా సతీమణి కారు దొంగతనం !

-

BJP President JP Nadda’s wife’s car stolen: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిగ్‌ షాక్‌ తగిలింది. జేపీ నడ్డా సతీమణి కారు చోరీకి గురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును ఢిల్లీ నివాసం నుంచి ఎత్తుకెళ్లారు కొందరు దొంగలు. అయితే.. ఈ నెల 19న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

BJP President JP Nadda’s wife’s car stolen, FIR lodged know details

జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును తెలిసిన వాళ్లే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news