బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య కు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది…ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య వెళ్లేందుకు ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది బీజేపీ. తాజాగా మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ పార్టీ. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య పేరు ఫైనల్ అయింది.
హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ల పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ పార్టీ. మూడు రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసిన బీజేపీ లిస్ట్ ఆర్ కృష్ణయ్య పేరు ఉండటం తో… రేపు నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 11 గంటల సమయంలో నామినేషన్ వేయనున్నారు ఆర్ కృష్ణయ్య.