పార్టీ పేరులో తెలంగాణ అని ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ : మంత్రి కోమటిరెడ్డి

-

రాష్ట్రంలో పార్టీ పేరులో తెలంగాణ అని ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీని టీపీసీసీ అంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా తెలంగాణ లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఉన్న పార్టీని తెలంగాణ గా మార్చారని తెలిపారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని గతంలో కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ఇవాళ సోనియా గాంధీ పుట్టిన రోజు తో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్న సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి శుభాకాంక్షలు చెప్పాల్సిందని అన్నారు. మొదటి సభలో ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియాగాంధీ లేకుంటే ఈ జన్మలో కాదు.. మరో జన్మలో కూడా తెలంగాణ రాకపోయేది.. ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చిందని సభలో కేసీఆర్ ప్రకటించారు అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news