తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రముఖ తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సేవక్కు శంకర్‌లను అన్యాయంగా ఉరితీశారని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ బెదిరింపులు ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ముంబై విమానాశ్రయం, హోటల్ ప్రాంగణాలను స్కాన్ చేయడానికి బృందాలను నియమించారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి అనుమానాస్పద వస్తువు లేదా కార్యకలాపాలు కనుగొనబడలేదు. అటు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) కూడా అప్రమత్తమైంది మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు.ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.