జమ్మూ డివిజన్‌లోని రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ (కంట్రోల్ లైన్) వెంట పాకిస్తాన్ కాల్పుల్లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) ఆదివారం ఉదయం మృతి చెందాడు. రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట కల్సియాన్, ఖాంగర్, భవానీ ప్రాంతాలలో చిన్నపాటి ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ ఆదివారం ఉదయం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లు రక్షణ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
కల్సియాన్ సెక్టార్ లో పాక్ పాక్ కాల్పుల్లో జెసిఓకు గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించారు, అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి అని అధికారి తెలిపారు. శనివారం పాకిస్తాన్ నుంచి తవ్విన 150 మీటర్ల టన్నెల్ ని కనుగొన్నారు అధికారులు. మరో వైపున పాక్ ఉగ్రవాదులు కూడా సరిహద్దుల్లో కాల్పులకు దిగుతున్నారు. భారత ఆర్మీ ఈ ఘటనలపై అప్రమత్తం అయింది.