భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ఈ రోజు ఉదయం 10 గంటలకు అంబాలాలోని వైమానిక దళం స్టేషన్ లో రాఫెల్ విమానాన్ని వాయుసేనలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనుందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మొదటి ఐదు రాఫెల్ విమానాలు జూలై 27, 2020 న ఫ్రాన్స్ నుండి అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
పార్లీ సెప్టెంబర్ 10 న భారత పర్యటనలో పాల్గొంటారు. 2017 నుండి పార్లీ మూడవ అధికారిక పర్యటన. కరోనా ఉన్నా సరే ఆమె మరోసారి భారత్ వస్తున్నారు. కరోనా తర్వాత ఆమె చేసిన మొదటి అధికారిక పర్యటన ఇదే అని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో ఆమె రాజ్ నాథ్ సింగ్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలుస్తారు.