బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది.ఈనెల 21న ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు.ఆ తరువాత రోజు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.గుజరాత్ కు రానున్న తొలి బ్రిటన్ ప్రధాని ఈయనే కావడం విశేషం.భారత ప్రధాని నరేంద్ర మోడీతో బోరిస్ చాలా లోతైన చర్చలు జరపనున్నారు అని బ్రిటన్ ప్రధాన కార్యాలయం శనివారం వెల్లడించింది.ప్రధాని, భారత్ లో కీలక పరిశ్రమల్లో పెట్టుబడులపై ప్రకటనలు వెలువడనున్నాయి అని తెలిపింది.ఢిల్లీలో మోడీ ని కలవనున్న బోరిస్ ఇరు దేశాల వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతి పైన ఇరు దేశాధినేతలు దృష్టి సారించనున్నారు.ఉద్యోగాల సృష్టి, ఆర్థికవృద్ధి, రక్షణ, ఇంధన రంగాల్లో భద్రత వంటి అంశాలపైన భారత పర్యటన సాగనుంది.అంతిమంగా ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్ళనున్నాం.నియంతృత్వ శక్తులు శాంతి సామరస్యాలకు సవాలు విసురుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశాలు కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది.అతి పెద్ద ఆర్థిక శక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్ కు బ్రిటన్ ఎంతో విలువ ఇస్తుంది.అని పర్యటనకు ముందు బోరిస్ వ్యాఖ్యానించారు.