మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చకు బీఆర్‌ఎస్‌ ఎంపీల వాయిదా తీర్మానం

-

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగిస్తోంది. నేడు లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.

ఇక త్వరలో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలకు ఎమ్మెల్సీ కవిత ప్రణాళికలు చేస్తున్నారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపుతున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసింది ఎమ్మెల్సీ కవిత. అనంతరం దాదాపు 15 పార్టీలు , ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక తాజాగా నేడు లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version