అరుణాచలంలో తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు అరెస్ట్ కూడా అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు తిరువన్నమలై గిరి ప్రదక్షణలో తెలుగు వారిపై కక్ష చూపుతున్నారని భక్తులు ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అరుణాచలంలో తెలుగువారి భద్రతపై అనుమానాలు మరింత పెరిగాయి.

తెలంగాణలోని యాదాద్రి సౌందర పురానికి చెందిన విద్యాసాగర్ అనే భక్తుడు జులై ఏడవ తేదీన తిరువన్నమలైలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు… అతడి గొంతు కోసి.. 500 రూపాయలు కాజేసి కూడా పారిపోయారట. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు కూడా చేశారు. గుగనేశ్వర్ అలాగే తమిళ రసం అనే వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.