ఉద్యోగులకు బైజూస్ షాక్.. 3500 మంది తొలగింపు!

-

భారత్​లోని పలు ఐటీ, ఎడ్​టెక్ సంస్థల్లో ఇంకా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీల్లో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలోని అతిపెద్ద ఎడ్​టెక్​ కంపెనీ బైజూస్ కూడా పలువురు ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు బైజూస్ మరో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. అందువల్లే భారం తగ్గించుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే అర్జున్​ మోహన్ బైజూస్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంస్థ పునర్​వ్యవస్థీకరణకు ఆయన ప్లాన్ రెడీ చేశారు. అందులో భాగంగా ఈ ఏడాది దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కరోనా సమయంలో బైజూస్ కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసివేయడం వల్ల డిజిటల్ ఎడ్యుకేషన్​కు మంచి ఆదరణ ఉండింది. ఆ సమయంలో ఈ కంపెనీ లాభాల బాట పట్టింది. కానీ కరోనా కనుమరుగైన తర్వాత ఎడ్​టెక్ సంస్థలు ఒక్కొక్కటిగా క్షీణించడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బైజూస్​పై తీవ్రమైన ఆర్థికభారం పడింది.

Read more RELATED
Recommended to you

Latest news