రేపు కేంద్రం కేబినెట్ మీటింగ్.. ఉక్రెయిన్ సంక్షోభం, భారతీయుల తరలింపుపై చర్చ

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో రేపు మధ్యాహ్న కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. తాజా పరిణామాలపై కేంద్ర క్యాబినెట్ చర్చింనుంది. ఇప్పటికే భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ సమాయత్తం అవుతోంది. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. రొమోనియా, హంగరీ దేశాల నుంచి భారతీయులను సేఫ్ గా ఇండియా తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లోని బోర్డర్లకు చేరుకోవాల్సిందిగా కీవ్ లోని ఇండియన్ ఎంబసీ సూచనలు చేసింది. కేంద్రం ఉచితంగా ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను ఇండియాకు చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ నుంచి బార్డర్ వరకు ఏవిధంగా విద్యార్థులను తీసుకురావాలనేదానిపై చర్చించనుంది కేబినెట్.

మరోవైపు ఈరెండు దేశాల మధ్య యుద్ధం భారతదేశంపై ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయాలను కూడా చర్చించనుంది. ఈ రెండు దేశాల నుంచి భారత్ అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇండియాపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాలతో పాటు… ద్వైపాక్షిక సంబంధాలపై, రష్యాతో సంబంధాలపై కేబినెట్ చర్చించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version