DAIRY MILK : కొత్త వివాదంలో డైరీ మిల్క్ చాక్లెట్ !

-

ఎక్కువగా మహిళలు మరియు లవర్స్ బాగా చాక్లెట్లు ఇష్టపడి తింటారు. ఇందులో ముఖ్యంగా క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ను ఎక్కువగా తింటారు. చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…. చిన్నపిల్లల్లోనూ ఎక్కువగా డైరీ మిల్క్ చాక్లెట్ ని ఇష్టపడతారు. అయితే తాజాగా డైరీ మిల్క్ చాక్లెట్ సంస్థ ఆ కొత్త వివాదంలో చిక్కుకుంది. క్యాడ్బరీ చాక్లెట్ల లో గుడ్డు మాంసం నుంచి తయారయ్యే జేలాటిన్ అనే పదార్థాన్ని వాడుతున్నారని తాజాగా విమర్శలు వస్తున్నాయి.

అంతే కాదు దీనికి సంబంధించిన ఓ పోస్టు క్యాడ్బరీ వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఇది నిజమేనా అని క్యాడ్బరీ సంస్థను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతే కాదు ఇదే కనుక నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రోడక్ట్ ను హిందువులచే బలవంతంగా తినిపించి నందుకు క్యాడ్బరీ సంస్థపై కేసు పెడతాను అంటూ ఆ నెటిజెన్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ వివాదం కాస్త పెద్దగా అయింది. అయితే ఈ వివాదంపై క్యాడ్బరీ సంస్థ స్పందించింది. క్యాడ్బరీ చాక్లెట్లు ఎలాంటి గుడ్డు మాంసం లేదని పేర్కొన్న సంస్థ… చాక్లెట్లను 100 శాతం వెజిటేరియన్ ఉత్పత్తులతో తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాక్లెట్లు క్యాడ్బరీ సంస్థకు చెందినవి కావని… తమ చాక్లెట్ల ర్యాపర్ పై ఆకుపచ్చ చుక్క ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news