ఖమ్మంలో షర్మిల.. సాయంత్రం 6 వరకూ దీక్ష

ఖమ్మం: నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిల పెనుబల్లిలో దీక్షకు దిగారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్షలో భాగంగా నిరసన చేపట్టారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల నియమక ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరహార దీక్ష చేపట్టారు. దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఈ దీక్ష జరగనుంది. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఆమె పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. ఇటీవల వైస్సార్ టీపీని ఆవిష్కరించిన ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకే తాను పార్టీ పెట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఆమె తెలంగాణలోని సమస్యలపై అధ్యయనం చేశారు. ఒక్కొక్కదానిపై ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నారు.