భారత్ – పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ కు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో భారత పౌరులలో ఆందోళన పెంచేందుకు పాక్ సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రచార యుద్ధం ప్రారంభించింది. గుజరాత్ లోని పోర్టు సహా, జలంధర్ లో డ్రోన్, క్షిపణి దాడులకి సంబంధించిన ఫోటోలు అంటూ పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలను షేర్ చేస్తున్నారు.
వీటిని భారత్ తిప్పి కొట్టింది పీఐబీ. ఫ్యాక్ట్ చెక్ చేసి అవన్నీ అబద్దాలు అని తేల్చింది. గుజరాత్ లోని హజీరా పోర్ట్ పై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వాస్తవం కాదని.. ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడు కి సంబంధించిదని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.