నిజ్జర్ హత్య వ్యవహారం.. భారత్పై మరోసారి నోరుపారేసుకున్న కెనడా

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు నేపథ్యంలో భారత్‌, కెనడా మధ్య గత కొంతకాలంగా దౌత్య విభేదాలు కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ గతంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ కేసు దర్యాప్తుపై తాజాగా స్పందించిన ట్రూడో మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు.

కెనడాకు చెందిన కేబుల్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ మీడియా ఛానల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తులో భారత్‌ సహకారంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కెనడా గడ్డపై తమ పౌరుడి హత్య జరగడం అత్యంత తీవ్రమైన అంశమని, ఇందులో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయన్న ట్రూడో దీన్ని తాము తేలిగ్గా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను కాపాడుకునే బాధ్యత తమపై ఉందిని, అందుకే దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version