కోల్ కతా మెడికో హత్యాచార ఘటనలో సీబీఐ దర్యాప్తు ప్రారంభం

-

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్‌ డాక్టర్ను రేప్ చేసి చంపేసిన ఘటన కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న కోల్కతా హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. దిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్‌ టీమ్‌లతో ఈ ఉదయం కోల్‌కతాకు చేరుకుంది. సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆర్‌జీకార్‌ ఆస్పత్రికి చేరుకుని ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రాణాలు కాపాడే వైద్యశాలలో దేవుడిగా భావించే వైద్య వృత్తిలో పని చేస్తున్న అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపేయడం పట్ల ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణం పోసే వారి ప్రాణాలకే రక్షణ లేదంటూ ఆందోళనకు వెల్లువెత్తడంతో ఈ కేసును కోల్కతా హైకోర్టు తీవ్రంగా పరిగణించి. మరోవైపు ఈ ఘటనలో దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సత్వరమే స్పందించిన సీబీఐ.. కేసును మళ్లీ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news