కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశ పెట్టిన కేంద్ర సర్కార్. ఈ మేరకు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదని వెల్లడించింది. ఆదాయపన్ను చెల్లింపులను సులభతరం చేస్తామని.. కార్పొరేట్ ట్యాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గింపు ఉంటుందని వివరించారు నిర్మలా సీతారామన్.
జైవిజ్ఞాన్, జైకిసాన్, జైఅనుసంధాన్ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నూతన పరిజ్ఞానం, మార్కెట్ వ్యవస్థ అనుసంధానంతో వ్యవసాయరంగాలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతమిచ్చామని వెల్లడించారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్షిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రైలు బోగీలను ఇప్పటికే వందేభారత్ ప్రమాణాలతో మార్పు చేశామని, భవిష్యత్లో మరికొన్ని చేయనున్నట్లు వివరించారు.