పారాసెటమాల్ టాబ్లెట్ల నిషేధంపై క్లారిటీ ఇచ్చింది. పారాసెటమాల్ టాబ్లెట్లను నిషేధించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. పారాసెటమాల్‌పై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు.

పారాసెటమాల్‌ను ఇతర ఔషధాలతో కలిపి తయారు చేసిన కొన్ని ‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్స్’ ను గతంలో నిషేధించినట్లు వెల్లడించారు. కాగా పారాసెటమాల్ ని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. తలనొప్పి, జ్వరంతో పాటూ పెయిన్ కిల్లర్ కింద కూడా వాడుతూ ఉంటారు. చిన్న లక్షణం ఏమైనా కనిపించినా పారాసెటమాల్ ని వాడుతూ త్వరగా నయం అయిపోవాలని అనుకుంటారు. అయితే పారాసెటమాల్ గురించి నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. పారా సెటమాల్ వలన కొన్ని ఇబ్బందులు తప్పవని, రిస్క్ లో పడాల్సి ఉంటుందని.. ముఖ్యంగా లివర్ ఇబ్బందుల్లో పడుతుందని తెలిపారు.