తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్ తెర పైకి వచ్చారు. ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించారు. ఈ నెల 3న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం… తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్ పేరును పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఐటీ రంగం చూసుకుంటున్నారు జయేష్ రంజన్ ఐఏఎస్. గతంలో ఐటి శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్న సమయంలో జయేష్ రంజన్.. ప్రత్యేక అధికారిగా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా… రేవంత్ రెడ్డి సర్కార్ లో కీలక అధికారిగా మారిపోయారు. రెండు ప్రభుత్వాలకు నమ్మిన బంటుగా ఉంటున్న జయేష్ రంజన్ కు ఇప్పుడు తెలంగాణ సిఎస్ పదవి రాబోతుందని చర్చ జరుగుతోంది.