ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని వెల్లడించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించింది కామారెడ్డి డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని ప్రధానిని చేశారా..? అని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క బీసీనైనా సీఎంను చేసిందాా..? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 27 మంది ఎంపీలను మంత్రులుగా, అనేక రాష్ట్రాలకు బీసీలను సీఎంలుగా నియమించిన ఘనత బీజేపీది అన్నారు బండి సంజయ్.