నేడు కేంద్ర కేబినెట్ సమావేశం ఉండనుంది. నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం ఉండనుంది. ఇక ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ తొలి భేటీ ఇదే కావడం విశేషం.
ఇక అటు రైతులకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. పెట్టుబడి సాయం పెంచింది ప్రధాని మోడీ సర్కార్. రైతులకు పంట పెట్టుబడి సాయం రూ.10 వేలకు పెంచిన కేంద్రం.. ఈ మేరకు ప్రకటన చేసింది. అటు పేదలకు మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సర్వే చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31లోగా అర్హుల ఎంపిక పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.