సినీ ఫక్కీలో తన స్పా సెంటర్‌కు వచ్చిన కస్టమర్‌ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించిన వ్యక్తికి ప్రకాశం పోలీసులు చెక్ పెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వారు స్పా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఒంగోలులో ఓ స్పా నిర్వాహకుడు ఏకంగా పోలీసు టీం ఏర్పాటు చేసి తన సొంత స్పా సెంటర్ పైనే రైడ్స్ చేయించాడు.
స్పా సెంటర్‌కు వచ్చిన ఓ విటుడి న్యూడ్ ఫోటోలు తీసి, తన నకిలీ పోలీస్ టీమ్‌తో నిర్వాహకుడు శ్యామ్ అతన్ని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమరంలోనే విటుడి నుంచి రూ.3 కోట్లు డిమాండ్ చేశాడు.అంత డబ్బు ఇవ్వలేనని విటుడు చెప్పడంతో చివరికి కనీసం రూ.3 లక్షలైనా ఇవ్వాలని శ్యామ్ అతన్ని బెదిరించాడు. దీంతో బాధితుడు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు శ్యామ్ అండ్ నకిలీ పోలీస్ టీమ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న పోలీసులు యూనిఫాం మెటీరియల్‌ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు.