లోక్ సభ సమరానికి ఈసీ సన్నాహం.. ఈనెల 7 నుంచి రాష్ట్రాల పర్యటన

-

సార్వత్రిక సమరం నెమ్మదిగా సమీపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు షురూ చేసింది. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా లేదో సమీక్షించనున్నారు. ఈ మేరకు జనవరి 7వ తేదీ నుంచి రాష్ట్రాల్లో పర్యటించనుంది. మొదటగా దక్షిణాదిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టనున్నారు.

లోక్‌సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టనుంది. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు వచ్చే వారం నుంచి పర్యటనలు చేపట్టనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఇతర కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన బృందం ఈనెల 7వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత 10వ తేదీన తమిళనాడులో పర్యటించి లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఈసీ ఈసారి పర్యటించే అవకాశం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version