ఇండియన్‌ ఆర్మీకి శుభవార్త.. ఇకపై శాటిలైట్‌ ఫోన్లు..!

-

ఇండియన్‌ ఆర్మీలో అనేక విభాగాల్లో పనిచేస్తున్న సైనికులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారికి శాటిలైట్‌ ఫోన్లను అందివ్వనున్నారు. ఈ మేరకు కేంద్రం భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌)కు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే సైనికులు డిజిటల్‌ శాటిలైట్‌ ఫోన్‌ టర్మినల్స్‌ను పొందుతారు.

central government to give satellite phones to army personnel

సైనికులు తమ విధుల్లో భాగంగా కొన్ని సార్లు నెలల తరబడి అత్యంత మారుమూల ప్రాంతాల్లో గడపాల్సి వస్తుంది. దీంతో వారికి కమ్యూనికేషన్‌ సమస్యగా మారింది. అయితే ఈ ఇబ్బందిని అధిగమించేందుకు గాను కేంద్రం ఇకపై వారికి నేరుగా శాటిలైట్‌ ఫోన్లనే అందివ్వనుంది. దీంతో కమ్యూనికేషన్‌ పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక వారు ఎక్కడ ఉన్నా తమ విభాగానికి చెందిన సైనికులు, అధికారులతోపాటు ఏకంగా తమ కుటుంబ సభ్యులకు కూడా అత్యంత క్వాలిటీతో కాల్స్‌ చేసుకుని మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది.

కేంద్రం సదరు ఫోన్లను అందిస్తే ఎంతో మంది సైనికులకు ఉపయోగకరంగా ఉంటుంది. సీఏపీఎఫ్‌ కిందకు వచ్చే అస్సాం రైఫిల్స్, బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌, సశస్త్ర సీమా బల్‌ విభాగాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది సిబ్బందికి ఆ ఫోన్లను అందివ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version