రాష్ట్రాలకు కేంద్రం షాక్‌.. ఇక రుణాలు ఇచ్చేది లేదు !

-

రాష్ట్రాలకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఇక రుణాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించే రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చే విషయంలో మార్చిన నిబంధనలను పేర్కొంటూ ఇటీవల సర్క్యులర్ ను జారీ చేసింది. రాష్ట్రాల రుణ అర్హత గణనలో ప్రభుత్వం ఉద్యోగి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించే మొత్తాన్ని ఆదనపు రుణ అర్హతగా పరిగణిస్తామని పేర్కొంది. జాతీయ పింఛను విధానంలో భాగమైన రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల జిఎస్డిపీలో మూడు శాతానికి మించి ఆదనంగా రుణాలు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version