పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో సంద్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రి నుంచి అతని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. దీంతో అతన్ని… తన చేతిలో పైన ఎత్తుకొని మరి… కన్న తండ్రి తీసుకువెళ్లాడు. అయితే ఈ డిశ్చార్జ్ విషయంలో.. కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్లో… శ్రీ తేజ్ చికిత్స పొందనున్నారు.

అంటే ఇంటికి తీసుకు వెళ్లకుండా అతని రిహాబిలిటేషన్ సెంటర్ కు తాజాగా తరలించారు. ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. తమను ఇంకా గుర్తుపట్టడం లేదని తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందర్నీ గుర్తుపట్టే వరకు కాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే 15 రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించబోతున్నారు. ఇది ఇలా ఉండగా సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంఘటనలో శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీ తేజ్ ఆసుపత్రి ఖర్చులన్నీ అల్లు అర్జున్ భరిస్తున్నాడు.