అమృత్‌సర్‌లో పాక్ డ్రోన్లను కూల్చివేసింది ఇండియా. ఈ మేరకు వీడియో షేర్ చేసింది భారత ఆర్మీ. శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో శత్రు డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు.వెంటనే దాన్ని కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది.

పాకిస్థాన్ మరో కుట్రకు తెర లేపింది. అణుబాంబు ప్రయోగానికి పాక్ సిద్ధం అయింది. భారత్ కొట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ విలవిలలాడుతోంది. దీంతో భారత్‌ను ఎలా ఢీ కొట్టాలో తెలియక ఏకంగా అణుబాంబు ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారని వార్తలు వస్తున్నాయి.