Delhi : ఢిల్లీలో 40అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన చిన్నారి..

-

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ బోరు బావిలో చిన్నారి దురదృష్టవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్ లో జరగడం గమనార్హం. ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేషోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంటులో ఉన్న 45 అడుగుల లోతైన బూర్భావిలో ప్రమాదవశాత్తు ఆ చిన్నారి పడిపోయింది.

Child falls into 40-ft-deep borewell at Delhi Jal Board plant, rescue operation underway

దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అలాగే ఎన్ డి ఆర్ ఎఫ్, ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి… బోరు బావిలో పడిన చిన్నారుని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు గంటల్లో చిన్నారిని బయటకు తీస్తామని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం బాధిత చిన్నారిని… బయటికి తీసుకువచ్చేందుకు సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version