‘నేను ఇండియాకు పెద్ద ఫ్యాన్.. కానీ’ : చైనా ఉన్నతాధికారి

-

ఇండియాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా ఉన్నతాధికారి ఒకరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ఇండియాకు వీరాభిమానిని’ అంటూ బంగ్లాదేశ్‌లో చైనా దౌత్యవేత్తగా ఉన్న లి జిమింగ్‌ వ్యాఖ్యానించారు. తమకు భారత్‌తో ఎటువంటి వ్యూహాత్మక శత్రుత్వం లేదని ఆయన తెలిపారు.

‘భారత్‌ను చైనాకు వ్యూహాత్మక శత్రువుగా లేక పోటీదారుగా మేము ఎన్నడూ చూడలేదు. వ్యక్తిగతంగా నేను భారత్‌కు పెద్ద అభిమానిని. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి మేం మరింత సన్నిహితంగా పనిచేస్తాం. అలాగే బంగాళాఖాతం వద్ద  భారీగా ఆయుధ మోహరింపులను చైనా కోరుకోవడం లేదు’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

భారత్ విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌, దిల్లీలోని చైనా దౌత్యవేత్త సన్‌ విడాంగ్‌ మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. భారత్‌, చైనా మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడాలంటే సరిహద్దు వద్ద ప్రశాంత వాతావరణం అవసరమని జై శంకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version