ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్… ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరన్నది ఆసక్తిగా మారింది.

ఈ జాబితాలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో చిరు తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కీలకంగా ఉండడంతో ఆయనకే ఉప రాష్ట్రపతి రావొచ్చనే చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్ అయింది. ‘ఎలక్టోరల్ కాలేజీ’లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికలో ఓటు వేస్తారు. అయితే ఈ ఎలక్షన్‌కి 395 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం NDAకి 426 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా బీజేపీకి 341 మంది ఉన్నారు. కాంగ్రెస్‌కి 126 మంది సభ్యుల బలం ఉంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే NDA సులభంగా విజయం సాధించనుంది.