తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ పై గొడవ.. CSK టీమ్ ని రద్దు చేయాలని డిమాండ్

-

తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ పై వివాదం రాజుకుంది. తమిళనాడుకు సంబంధించిన ఒక్క ఆటగాడు కూడా చెన్నై సూపర్ కింగ్స్ లో లేడంటూ అసెంబ్లీలో పిఎంకె ఆందోళన చేపట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ని రద్దు చేయాలని పిఎంకె పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై క్రీడా శాఖ మంత్రి స్పందించాలని డిమాండ్ చేసింది పిఎంకె. క్రికెట్ పేరుతో చెన్నై టీం యాజమాన్యం వ్యాపారం చేస్తుందని పీఎంకే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

అలాగే ఐపీఎల్ టికెట్లపై కూడా అసెంబ్లీలో వివాదం చెలరేగింది. ఐపీఎల్ మ్యాచ్ లకు టికెట్లు ఎమ్మెల్యేలకు ఇస్తే బాగుంటుందని ఏఐడీఎంకే మాజీ మంత్రి ఎస్సీ వేలుమని వ్యాఖ్యానించారు. ఏఐడీఎంకే ప్రభుత్వంలో మేము అందరికీ ఐపీఎల్ టికెట్లు ఇచ్చామని అన్నారు మాజీ మంత్రి. దీంతో మాజీ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు క్రీడా శాఖ మంత్రి ఉదయనిది స్టాలిన్. ఐపీఎల్ నిర్వహించేది మీ మిత్రుడైన కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షానే కదా..! మేము అడిగితే మాకు ఇవ్వరు.. మీరు అడిగితే ఇస్తారంటూ చురకలంటిచారు. మేము టికెట్స్ సొంత డబ్బులు పెట్టుకొని తమ వారికోసం ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version