BREAKING : ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ సిబిఐ ముందుకు సీఎం కేజ్రీవాల్

-

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ సిబిఐ ముందుకు సీఎం కేజ్రీవాల్ వెళ్లనున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. లిక్కర్ పాలసీ తయారీ లో ఢిల్లీ సీఎం పాత్ర పై ఫోకస్ పెట్టాయి దర్యాప్తు సంస్థలు.

ముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆటంకం క లగకుండా ఉండేలా శెలవు రోజైన ఆదివారం కేజ్రీవాల్ ను విచారణ చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ “సి బిఐ” నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై నిన్న కేజ్రీవాల్‌ మాట్లాడారు. ఢిల్లీ లో అసలు లిక్కర్ స్కాం లేదు.. సీబీఐ, ఈడి లు కావాలనే ఇరికిస్తున్నాయని సీఎం కేజ్రివాల్ ఆగ్రహం వ్య క్తం చేశారు. దర్యాప్తు సంస్థల తీరుపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు కేజ్రివాల్. ఇప్పటికే అరెస్టయిన వాళ్ళను, విచారించిన వాళ్ళను సీబీఐ, ఈడి లు టార్చర్ పెట్టాయని ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం కే జ్రివాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version