సీఎం స్టాలిన్ కి ఆ దమ్ములేదు – ఖుష్బూ

-

ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సినీనటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే కుష్బూ నియామకంపై డీఎంకే స్పీకర్ శివాజీ కృష్ణమూర్తి ఓ బేటికపై మాట్లాడుతూ.. ” ఆమె ఓ పాత పాత్ర” పని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా స్పీకర్ శివాజీ కృష్ణమూర్తి తనపై చేసిన ఆరోపణలపై ఖుష్బూ సుందర్ స్పందించారు. శివాజీ కృష్ణమూర్తి ఒక్కడే కాదు గతంలో ఎంతో మంది డీఎంకే నేతలు తనను అవమానించారని అన్నారు.

అది వాళ్లకు అలవాటేనని అన్నారు. మాట్లాడడానికి ఏం లేనప్పుడు కొందరు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారని విమర్శించారు. డీఎంకే లో మహిళలను అవమానించే నేతలకు కొదవలేదని సెటైర్లు వేశారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించాలని కోరుకుంటున్నానని.. కానీ ఆయనకు ఆ దమ్ము లేదని ఎద్దేవా చేశారు. డీఎంకే లోని మగ నాయకులకు అనవసరమైన విషయాల గురించి మాట్లాడమంటే సరదా అని చురకలంటించారు. ఆయనకు ఎంత ఫ్రీడమ్ ఇస్తే ఆ పార్టీ అంతా కష్టాలలో పడుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version