బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయన్న విషయం తెలిసిందే. కేవలం ఇవే కాకుండా… ఏటీఎం లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ ఛార్జీలు కూడా విధిస్తూ ఉంటాయి. ఇలా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఐడీబీఐ ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కనీస బ్యాలెన్స్ ఉంచని కారణంగా రూ.21,000 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,000 కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6,000 కోట్లు సేకరించినట్లు అందులో తెలిపింది. కొన్ని రకాల ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే వాటిపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఈ ఛార్జీలు ప్రాంతాల వారీగా మారుతుంటాయని ఆర్థిక శాఖ వెల్లడించింది.