హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 30 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

congress-bjp

ఇక అటు జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్+ఎన్‌సీ ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తూన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, కేంద్ర బలగాల మోహరింపు ఏర్పాటు చేశారు అధికారులు.

రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించనున్నారు 12,000 మంది పోలీసులు.
ప్రతి కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో చెక్ పోస్టుల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో… కాంగ్రెస్ హవా ఉంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్కు 55 సీట్లకు పైగా వస్తాయని సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగ్ ఏర్పడే ఛాన్సులు ఎక్కు వగా ఉన్నట్లు కొన్ని సంస్థలు తెలపడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news