లోక్‌సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ హామీల వర్షం

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ మరోవైపు హమీల వర్షం కురిపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాజాగా మహిళలపై హామీల వర్షం కురిపించింది. మహిళలకు ఐదు గ్యారంటీలను ప్రకటించింది. “నారీ న్యాయ్‌” గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 5 హామీలను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏటా లక్ష రూపాయలు నగదు బదిలీ చేస్తామని ఈ పోస్టులో ఖర్గే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. “శక్తి కా సమ్మాన్‌” గ్యారంటీ కింద ఆషా కార్యకర్తలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్నభోజనం సిబ్బందికి కేంద్రం ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తామని, “అధికార మైత్రి” గ్యారంటీ కింద ప్రతి పంచాయతీలో మహిళలకు వారి న్యాయపరమైన హక్కులపై అవగాహన, సహకారం అందిస్తామని ఖర్గే వివరించారు. “సావిత్రిబాయి పూలే హాస్టల్స్‌” గ్యారంటీ కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం హాస్టల్స్‌ సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news