వర్క్‌.. వెల్త్‌.. వెల్ఫేర్‌.. కాంగ్రెస్​ ఎన్నికల హామీలు ఇవే

-

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ  న్యాయ్‌పత్ర పేరుతో దిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ చిదంబరం తెలిపారు.

కాంగ్రెస్​ ఎన్నికల హామీలు ఇవే

  • దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహించడం
  • ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్​ కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయడం
  • ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పది శాతం EWS కోటా అన్ని కులాలు, వర్గాలకు వివక్ష లేకుండా అందించడం
  • ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ కోసం రూ.25 లక్షల వరకు నగదు రహిత బీమా అందించడం
  • పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం
  • కిసాన్‌ న్యాయ్‌ పేరుతో రైతులకు భరోసా
  • కనీస మద్దతు ధర చట్టం తీసుకురావడం
  • విద్యార్థులకు రూ.లక్ష ఆర్థికసాయం
  • వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం నెలకు రూ.200-500 నుంచి రూ.1000కి పెంపు
  • సీనియర్ సిటిజన్లకు నిర్లక్ష్యం, దుర్వినియోగం, ఒంటరిగా విడిచిపెట్టడం, ఆర్థిక మోసం వంటి సందర్భాల్లో న్యాయ సేవలను సులభంగా పొందేలా చర్యలు తీసుకోవడం
  • దివ్యాంగుల హక్కుల చట్టం,2016ను కఠినంగా అమలుచేయడం
  • LGBTQIA+ వర్గాని చెందిన జంటలను గుర్తించడానికి కొత్త చట్టం తీసుకురావడం
  • బ్రెయిలీ లిపి, సంకేత భాషను భాషలుగా గుర్తించడం
  • రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్‌ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ రెట్టింపు
  • రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
  • ప్రతి జిల్లాలో లైబ్రరీలతో కూడిన అంబేడ్కర్‌ భవనాలు
  • వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడితే కఠినచర్యలకు చట్టం
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌
  • ఉపాధి హామీ పథకం కూలీ రోజుకు రూ.400కు పెంపు

Read more RELATED
Recommended to you

Latest news