జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి..మెజార్టీ మార్క్ ను దాటింది. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ కూటమి ఉంది. అటు 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో బీజేపీ ఉంది.. మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ..ఈ సారి బొక్కబోర్లా పడింది. కేవలం 5 సీట్లలో మాత్రమే పీడీపీ లీడింగ్ ఉంది.. జమ్మూలో బీజేపీ లెక్కలు..తప్పాయి. అటు ఏమాత్రం ప్రభావం చూపలేదు ఆజాద్ పార్టీ.
ఇక అటు హర్యానా రాష్ట్రంలో అధికారం దిశగా దూసుకు వెళ్తోంది బిజెపి పార్టీ. కాసేపటికి క్రితమే హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి బిజెపి… దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం 49 స్థానాల్లో బిజెపి స్పష్టమైన ఆదిత్యాన్ని ప్రదర్శిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లోనే ఆదిత్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ హర్యానా రాష్ట్రంలో 46గా ఫిక్స్ చేశారు.అంటే బిజెపి అధికారం ఖాయమని తేలిపోయింది. అటు హర్యానా రాష్ట్రంలో జేజేఎం, ఐ ఎన్ ఎల్ డి ప్రభావం చూపలేకపోయాయి.