ఇక మోదీ హిమాలయాలకు వెళ్తే బెటర్.. కాంగ్రెస్ ఎద్దేవా

-

లోక్​సభ ఫలితాలు​ ఒక్కొక్కటిగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు, ఆధిక్యం చూస్తుంటే ప్రధాని మోదీ అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదం నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది. ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీగా నిలిచింది. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి రాజకీయంగా, నిర్ణయాత్మకంగా నైతిక ఓటమి అని పేర్కొంది. ఆయన రాజీనామా చేసి హిమాలయాలకు వెళ్లాలని కాంగ్రెస్​ ఎద్దేవా చేసింది.

మరోవైపు, ఎన్డీఏ మిత్రపక్షాలతో టచ్​లో ఉన్నారా అన్న ప్రశ్నకు కాంగ్రెస్​ నేత పవన్ ఖేరా స్పందించారు. తెర వెనుక జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని బహిరంగపరచలేమని చెప్పారు. “మేం టార్గెట్​ను 295 సీట్లుగా పెట్టుకున్నాం. అన్నీ సవ్యంగా జరిగితే 295కి చేరుకుంటాం. ఫలితాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న విశ్వాసంతో ఉన్నాం” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news