లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమితో పొత్తు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇటీవలే జమ్మూకశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మూడు స్థానాల్లో పోటీకీ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3-3 సీట్ల పంపంకం ఫార్ములాను ప్రతిపాదించింది. ఈ విషయం పై ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒవర్ అబ్దుల్లాతో చర్చలు జరుపనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రతిపాదనకు నేషనల్ కాన్ఫరెన్స్ అంగీకరిస్తే.. మెహబూబా ముప్తికి చెందిన పీడీపీ కి పొత్తులో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. పీడీపీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యం పక్షం కావడం గమనార్హం. ఫిబ్రవరి 15 ఫరూక్ అబ్దుల్లా తాము లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం.. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం తమ పార్టీ ఇండియా కూటమితో పొత్తుకు కట్టుబడి ఉందని తెలిపారు.