న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 415 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3,98,100 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ 44 కోట్ల 19 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. మరో 51 లక్షల మంది వ్యాక్సిన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 42,363 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 3 కోట్ల 6 లక్షల మంది కరోనా చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారని కేంద్రవైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
కాగా కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి. మరోవైపు వ్యాక్సినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీంతో వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తున్నారు.