దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా అధికసంఖ్యలోనే ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
అయితే తాజాగా.. ఢిల్లీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గల సిబ్బందికి, నేతలకి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఇప్పటికే కరోనా సోకిన వారు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇకపోతే ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 2,25,796 కి చేరింది. ఆలగే మరణాల సంఖ్య 4,806 కి చేరింది.